DIGITAL MANCHERIAL NEWS:- బెల్లంపల్లి నియోజకవర్గం లోని వేమనపల్లి మండల కేంద్రానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన బాకి వినోద్ మమతల కుమారుడు గత కొన్ని రోజుల నుండి తీవ్రమైన అనారోగ్యంతో హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పటల్ లో చికిత్స పొందుతున్నాడు. రెక్కాడుతే కాని డొక్కాడని కుటుంభం కావడంతో చికిత్స కు సరిపడ డబ్బులు లేక పోవడంతో వేమనపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోళి వేణుమాధవ్ రావు తక్షిణమే మన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కి విషయం తెలపడంతో ఎమ్మెల్యే వెంటనే స్పందించి ఆ చిన్నారి చికిత్స కోసం మన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సహాయ నిధి నుండి 1,50,000/- ఎల్ ఓ సిని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అందచేయడం జరిగింది. ఈ సందర్భంగా... బాకి వినోద్ మమత దంపతులు మాట్లాడుతూ... ముఖ్యమంత్రి కెసిఆర్ కి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కి జీవితాంతం రుణపడి ఉంటామని తెలియజేయడం జరిగింది.


