తాజ్ బాబా సేవాసమితి ఆధ్వర్యంలో రంజాన్ కిట్లు పంపిణీ.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- బెల్లంపల్లి పట్టణంలోని తాజ్ బాబా సేవా సమితి ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ మాసం సందర్బంగా అబ్దుల్ రహీం జ్ఞాపకార్థకం తాండూర్ మండల కేంద్రంలోని నజీర్ కాలనిలో నివసిస్తున్న పదకొండు నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ పండుగ రోజు అవసరమాయ్యే సేమియా, బియ్యం, నూనెతో పాటు 11 రకాల నిత్యావసరసరుకులు, ప్రతీ కుటుంబానికి 200 వందల రూపాయలను అందజేశారు. అనంతరం ఉస్మాన్ పాషా మాట్లాడుతూ... తాను తమ ఇంట్లో పండుగ వేడుకలు ఎలా చేసుకుంటారో అదే విధంగా నిరుపేద కుటుంబాలు కూడా పండుగ వేడుకలను నిర్వహించుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని, అదేవిధంగా ఎవరు ఏమన్నా తన కంఠం లో ప్రాణం ఉన్నంత వరకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాజ్ బాబా సేవాసమితి సభ్యులు అబ్బు సాత్, హాజి బాబా, శ్రీనులాల్, బాదే విశ్వాస్, మధు తదితరులు పాల్గొన్నారు.




Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by