దసరా సినిమాలో నటించిన వ్యక్తికి ఘన సన్మానం.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- కాసిపేట మండలంలోని పెద్దనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని సోమగూడెం న్యూ కాలనీ కీ చెందిన గడ్డం సురేష్ అన్న కీ గ్రామ సర్పంచ్ వేముల కృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికి, పంచాయతీ కార్యాలయంలో సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం నుద్దేశించి సర్పంచ్ మాట్లాడుతూ... ఈ రోజు సినిమా రంగంలో ఎలాంటి అండదండలు లేకున్నా తన టాలెంట్ తో ఈ పాన్ ఇండియా సినిమా దసరా సినిమా లో న్యాచురల్ స్టార్ నాని తో నటించి తెలంగాణ యాసలో పాటలు డైలాగులు వ్రాసి మా గ్రామాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టినందుకు మా గ్రామస్తులకు చాలా సంతోషాన్ని కలిగించింది మరియు గర్వకారణంగా ఉందని అలాగే భవిష్యత్తులో మరింత రెట్టింపు ఉత్సాహంతో ముందుకు నడువాలాని, మంచి అవకాశాలు సినిమారంగంలో రావాలని అలాగే ఆ కుటుంబానికి ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లా వేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వేముల కృష్ణ, వార్డు సభ్యులు కొత్త రమేష్ పంబాల తిరుపతి కంచర్ల పద్మ, మాజి సర్పంచ్ కామేర శ్రీనివాస్, మాజి వార్డు సభ్యులు కల్వల జమున, నాయకులు గాదం గట్టయ్య శ్రీనివాస్, రాజు, మధు, అబిబ్ రాజేశ్వరి గ్రామ పెద్దలు వేముల చంద్రయ్య, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని నిండుగా దీవేనలు అందించారు.




Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by