DIGITAL MANCHERIAL NEWS:- బెల్లంపల్లి నియోజకవర్గ పరిధిలోని 25 మంది లబ్ధిదారులకు 10,03,000 (పది లక్షల మూడు వేల) రూపాయల విలువగల సిఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన బెల్లంపల్లి శాసనసభ్యులు దుర్గం చిన్నయ్య. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం నిరుపేద కుటుంబాలకు ఎంతో అండగా నిలుస్తుంది, రానున్న ఎన్నికలలో కూడా టిఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని, అధికార పార్టీపై ఎవరెన్ని కుట్రలు పన్నిన బిఆర్ఎస్ గెలుపును రానున్న ఎన్నికలలో ఎవరు ఆపలేరని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ సుదర్శన్, టౌన్ ప్రెసిడెంట్ బొడ్డు నారాయణ, కౌన్సిలర్స్ నీలి కృష్ణ, చంద్రశేఖర్, సర్పంచ్ శశికళ, ఎస్.సి సెల్ ప్రెసిడెంట్ కిరణ్, నాయకులు రాంచందర్, శ్రీధర్, మల్లేష్, రమేష్ మరియు ఇతర ప్రజాప్రతినిధులు, BRS నాయకులు, కార్యకర్తలు, లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు.

