సమాజ సేవ చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండల కేంద్రంలో లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పదవ తరగతి పరీక్ష కేంద్రం వద్ద వేసవికాలం దృష్టిలో ఉంచుకొని సోమవారం వార్షిక పరీక్షలు రాసి వస్తున్న విద్యార్థులకు స్థానిక ఎస్సై కుందారపు ప్రసాద్ చేతుల మీదుగా మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక ఎస్సై మాట్లాడుతూ.... లైన్స్ క్లబ్ సంఘ సభ్యులు సేవా కార్యక్రమాలు చేపట్టడం చాలా సంతోషకరమైన విషయం కొనియాడారు.  విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు ప్రయాణికులు స్థానికులకు కూడా ఉచితంగా మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు జాబ్ సుగుణాకర్, అన్నం సత్యనారాయణ, బాదం శెట్టి మల్లికార్జున్, పాత శ్రీనివాస్, ఎనగందుల సత్యం, కొత్త శ్రావణ్, గడిగొప్పుల వినోద్ కుమార్, జక్కుల దిలీప్ అజీమ్ తదితరులు పాల్గొన్నారు.




Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by