DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల నియోజకవర్గంలోని లక్షెట్టిపేట పట్టణంలో ఎస్ ఆర్ ఆర్ గార్డెన్స్ లో లక్షెట్టిపేట మండలం కి చెందిన గులాబీ శ్రేణులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా ఇంచార్జ్ , మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్, ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జి నారదాసు లక్ష్మణ్ మాట్లాడుతూ... ప్రతి ఒక్కరు సమన్వయంతో పాటు మరింత బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులు అందర్నీ భాగస్వామ్యం చేసేలా కార్యక్రమం రూపొందించాలని, బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధించాలి పేర్కొన్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు మాట్లాడుతూ.. ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్, డీసీఎంఎస్ చైర్మన్ తిప్పని లింగన్న, మున్సిపల్ చైర్మన్ నలమాస్ కాంతయ్య, వైస్ చైర్మన్ పొడేటి శ్రీనివాస్,మండల అధ్యక్షుడు చుంచు చిన్నయ్య,పాదం శ్రీనివాస్ ,గ్రామ సర్పంచులు,ఎంపీటీసీలు,ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

