DIGITAL MANCHERIAL NEWS:- కాసిపేట మండలంలోని వెంకటాపూర్, రొట్టెపల్లి, తిరుమలపూర్, పెద్దనపల్లి నాయకపు గుడా, సోనాపూర్ గ్రామాల్లో ఆరోగ్య ఉప కేంద్రాలు లేనందున గర్భిణీ స్త్రీలు బాలింతలకు అనారోగ్య సమస్యలు ఏర్పడినప్పుడు వైద్య పరీక్షలు చేయించుకునేందుకు 15 కిలోమీటర్ దూరంలో ఉన్న కాసిపేట మండల కేంద్రానికి రావాల్సి వస్తుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వేముల కృష్ణ అన్నారు. అలాగే పూర్తిగా ఏజెన్సీ మండలం కావడంతో, ఈ ప్రాంతాలలో సరైన వైద్యం అందడం లేదని, ఈ గ్రామాల్లో మెరుగైన వైద్యం అందే విధంగా ఉండేందుకు వెంకటాపూర్, నాయకపు గుడెంలో (పెద్దనపల్లి) ఆరోగ్య ఉప కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరుతూ బుధవారం ఉట్నూరు ప్రాజెక్ట్ అధికారి పిఓ కార్యాలయంలో వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మెరుగైన వైద్యం అందిస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెప్తుంది తప్ప, ఆదివాసి గ్రామంలో ఎలాంటి వైద్యం అందక మృత్యువాత పడుతున్నారని అన్నారు. ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి స్పందించి ఆరోగ్య ఉప కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు.

