DIGITAL MANCHERIAL NEWS:- కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా లో మావోయిస్టు కార్యకలాపాలు చెపట్టుతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్ ఐపిఎస్ శనివారం కాగజ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో తెలిపారు.
అరెస్ట్ అయిన వారి వివరాలు:-
• A1. కోట ఆనందరావు S/O మల్లేష్, 26 సo.లు, కులము : నేతకాని R/o జిల్లేడ గ్రామం మురళీగుడ జి.పి, పెంచికల్పేట్ మండలము, ఆసిఫాబాద్ జిల్లా.
• A2. చేన్నగొని గణేష్ @ అభిరాం @సూర్య s/o నరసింహ, 22 సo.లు, కులము: గౌడ్, R/o కోరిటికల్ గ్రామము, మునుగోడు మండలము, నల్గొండ జిల్లా.
విశ్వసనీయ సమాచారం మేరకు తేది 28-04-2023 న కాగజ్‌నగర్ రూరల్ సిఐ నాగరాజు మరియు పెంచికల్పేట్ పోలీస్ సిబ్బంది తో కలిసి అగర్ గూడ గ్రామ శివారు గుట్టల వద్ద ఆకస్మిక తనిఖీ నిర్వహించుచుండగా పైన తెల్పిన కోట ఆనందరావు మరియు చేన్నగొని గణేష్ @ అభిరాం @సూర్య s/o నరసింహ, 22 సo.లు అనుమానాస్పదంగా ద్విచక్రవాహనంపై బెజ్జూర్ అటవీ ప్రాంతం వెళ్తుండగా, వారిని పట్టుకొని విచారించంగా వారు సిపిఐ మావోయిష్టు పార్టీ కి సానుభూతి పరులుగా పనిచేయుచు ప్రజా సంఘాలలో పని చేస్తున్నామని మరియు సిపిఐ మావోయిష్టు పార్టీ దళం లో చేరుటకు సభ్యులను రిక్రూట్ చేస్తున్నామని, వారు వచ్చినప్పుడు వారికి వస్తువులు కొనిపెట్టటం మరియు వాటిని సరఫరా చెయ్యటం మరియు భోజనం పెట్టటం, అదేవిధంగా ఊర్లలో ఉన్న మిలిటెంట్ లను పార్టీకి అనుకూలంగా పని చేసే విధంగా చేస్తున్నాం మరియు సిపిఐ మావోయిష్టు పార్టీ తరుపున కాంట్రాక్టర్ ల వద్ద డబ్బులు వసూలు చేసి ఇస్తున్నాం అని, తనకు సిపఐ మావోయిష్టు పార్టీ లో పుల్లూరి ప్రసాదరావు @ చంద్రన్న, మైలారపు అడేల్లు @ భాస్కర్, బండి ప్రకాష్ @ ప్రభాత్, రాధక్క, మున్న, వర్గీష్, మనీష్, రమణ @ చెన్నూరి శ్రీనివాస్ మరియు ఇంకా కొంత మందితో పరిచయాలు ఉన్నవని, అప్పుడప్పుడు వారిని మా ఊరికి వచ్చినప్పుడు మరియు గడ్చిరోలి అడవీ ప్రాంతంలో మరియు ఛత్తీస్-ఘడ్ అడవీ ప్రాంతానికి వెళ్ళి కలిసేవాడినని, పుల్లూరి ప్రసాదరావు @ చంద్రన్న మైలారపు అడేల్లు @ భాస్కర్ మరియు బండి ప్రకాష్ @ ప్రభాత్ లు చెప్పినట్లు తను నడుచుకునే వాడినని చెప్పాడు. కోట ఆనందరావు వద్ద ఉన్న చేతి సంచి ని తనిఖీ చేయగా అందులో : (5) జెలటిన్ స్టిక్స్, (15) ఎలక్ట్రిక్ దేతోనతోర్స్ మావోఇస్టు సాహిత్యం మొబైల్ ఫోన్ స్వాదీనం చేసుకున్నారు మరియు మోటర్ సైకల్ స్వాదినపరుచుకున్నాం. అదేవిధంగా గణేశ్ ను కూడా CPI మావోయిష్టు పార్టీ చేరితే బాగుంటుందని కోట ఆనందరావు తనను ప్రోత్సహించినాడు. కోట ఆనందరావు తనకు అప్పుడప్పుడు విప్లవం సాహిత్యం బుక్స్ ఇచ్చి చదువమనేవాడు. జంగ్ బుక్ మరియు ఇతర కొన్ని సాహిత్యం బుక్స్ చదివినానని, ఈ విధంగా మా పరిచయం ఉండగా, తేది ౩౦ మార్చి నాడు కోట ఆనందరావు తనను కలిసి CPI మావోయిష్టు పార్టీ దళం లోపలి వెళ్ళటానికి ఒక అవకాశం వచ్చినది తనతో రమ్మని చెప్పి, దాని గురించి కోట ఆనందరావు తనకు మొత్తం వివరించినాడని, తేది ౦౩ ఏప్రిల్ 2023 నాడు ఉదయం కోట ఆనందరావు తనను, సికింద్రాబాద్ నుండి ట్రైన్ లో తీసుకొని మంచిర్యాలకు వచ్చినాడని, ఇద్దరు మంచిర్యాల వచ్చి ట్రైన్ దిగిన తర్వాత కోట ఆనందరావు ఎవరితోనో ఫోన్ లో మాట్లాడినాడని, తర్వాత హోటల్ లో ఇద్దరం భోజనం చేసినాక, అక్కడకు ఇద్దరు వ్యక్తులు బైక్ పై వచ్చినారు. కోట ఆనందరావు వారికి తనను పరిచయం చేసి, వారికి తనను అప్పగించగా వారు తనను మహారాష్ట్ర లోని సిర్వంచ మీదుగా, ఛత్తీస్-గడ్ లోని భూపాలపట్నం దగ్గరలో ఒక గూడెం కు తీసుకొని వెళ్ళినారు. సుమారు 5-6 గంటల ప్రయాణం చేసి అక్కడకు చేరుకున్నాం తర్వాత ఒక ఇంట్లో ఉన్నాము. రాత్రి అక్కడే తిని పడుకున్నాము. తర్వాత రోజు ఉదయం అక్కడ నుండి బయలుదేరి ఛత్తీస్-గడ్ లో వేరే ఊరికి వెల్లినాము. మధ్యాహ్నం వరకు అక్కడికి చెరుకొని అక్కడ ఒకరి ఇంటి దగ్గర ఉన్నాం. ఆరోజు ఇద్దరు వ్యక్తులు మా దగ్గరకు వచ్చి, కోట ఆనందరావు పంపిన వ్యక్తి నీవేకదా అని పరిచయం చేసుకున్నారు. వారి పేర్లు తెలుసు కొనగా వర్గీష్ మరియు మనీష్ అని తెలిపి, వారు CPI మావోయిష్టు పార్టి లో తెలంగాణా రాష్ట్రం మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల పరిధిలో పని చేస్తున్నట్లు తెలిపినారు. వారిదగ్గర తుపాకులు కూడా కలవు. వారితో అరగంట మాట్లాడిన తరవాత మేము ముగ్గురం కలిసి అక్కడ నుండి సుమారు గంటన్నర నడుస్తూ అడవిలో ప్రయాణం చేసి అడవిలో ఒక ప్రాంతం చేరుకున్నాము. అక్కడ 10 మంది వరకు CPI మావోయిష్టు దళ సభ్యులు ఉన్నారు, వారిలో కొంతమందిని నాకు పరిచయం చేసినారు. వారు పుల్లూరి ప్రసాద రావు @ చంద్రన్న, మైలారపు అడేల్లు @ భాస్కర్, బండి ప్రకాష్ @ ప్రభాత్, రాధక్క, మున్న మరియు కొంత మంది ఉన్నారు. వారితో పాటు సుమారు వారం రోజులు దళం లో ఉన్నాను. తర్వాత దళంనకు కావలసిన ప్రేలుడు పదార్దాలు మరియు పార్టీకి సంబంధించిన డాక్యుమెంట్స్ కోట ఆనందరావు ను కలిసి తీసుకొని రమ్మని మైలారపు అడేల్లు @ భాస్కర్ నాకు తెలుపగా తిరిగి నేను 11 వ తారీఖు నాడు మళ్ళీ హైదరాబాద్ వచ్చి A1 కోట ఆనందరావు (5) జెలటిన్ స్టిక్స్ , (15), డిటోనేరర్సు, పార్టీ డాక్యుమెంట్స్, మొబైల్ ఫోన మరియు మోటర్ సైకల్ స్వాదినం చేసుకోడం జరిగింది. A2 చేన్నగొని గణేష్ @ అభిరాం @ సూర్య వద్ద నుండి : (5) జెలటిన్ స్టిక్స్, (10) ఎలక్ట్రిక్ దేతోనతోర్స్, పార్టీ డాక్యుమెంట్స్ , మొబైల్ ఫోన్ స్వాదీనం చేసుకున్నారు.
• వారిని విచారించగా తెలిపిన వివరాలు:-
సంక్షిప్త గమనిక:- A1 కోట ఆనందరావు స్వగ్రామం జిల్లెడ ప్రాణహిత నదికి సమీపంలో ఉంది మరియు CPI మావోయిస్టు పార్టీ సభ్యులు వారి గ్రామానికి వెళ్లేవారు. చిన్నతనం నుంచి సీపీఐ మావోయిస్టు పార్టీ సిద్ధాంతాల వైపు ఆకర్షితుడయ్యాడు. అటవీ ప్రాంతంలో సీపీఐ మావోయిస్టు నేతలు పుల్లూరి ప్రసాదరావు @ చంద్రన్న, మైలారపు అడెల్లు @ భాస్కర్, బండి ప్రభాకర్ @ ప్రభాత్‌లతో పలుమార్లు సమావేశమై వాట్సాప్ కాల్స్, ఇతర సీక్రెట్ యాప్స్‌లో టచ్‌లో ఉన్నారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ ఎంఏ ఫిలాసఫీ పూర్తి చేసి పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఇప్పుడు పాపని నాగరాజు స్థాపించిన "కుల నిర్మూలన వేదిక"లో సెక్రటరీగా పని చేస్తూ, హైదరాబాద్‌లో అద్దె గదిలో ఉంటూ తన జీవనోపాధి కోసం క్యాటరింగ్ బాయ్‌గా కూడా పనిచేస్తున్నాడు. అతను సోయం చిన్నయ్య, సిడం జంగ్‌దేవ్, కోట సతీష్, (అతని తమ్ముడు), సెడ్మాక నగేష్ నాద్ పోర్శెట్టి ధర్మయ్య మరియు ఇతరులతో పాటు పీపుల్ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్‌లో పనిచేస్తున్నారు. అలాగే దళం సభ్యులను చేర్చుకోవడం, వారికి వస్తువులు కొనుగోలు చేయడం, సరఫరా చేయడం, ఆహారం ఏర్పాటు చేయడం, పోరాటయోధులను పర్యవేక్షించడం వంటివి సీపీఐ మావోయిస్టు పార్టీ కోసం కష్టపడి పనిచేయడంతోపాటు కాంట్రాక్టర్ల నుంచి పార్టీకి నిధులు వసూలు చేసి సీపీఐ పార్టీకి అప్పగించేవారు.
సంక్షిప్త గమనిక:- A2 చెన్నగోని గణేష్ @ అభిరామ్ @ సూర్య హైదరాబాద్‌లోని చెన్నైలోని అమృత కళాశాలలో హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు పూర్తి చేసి, హైదరాబాద్‌లో క్యాటరింగ్ బాయ్‌గా పనిచేస్తున్నారు. ఒక సంవత్సరం క్రితం, వీరిద్దరు క్యాటరింగ్ చేస్తున్నప్పుడు ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు మరియు CPI మావోయిస్టుల పట్ల ఇద్దరూ ఒకే భావజాలం కలిగి ఉన్నందున స్నేహితులుగా మారారు. సీపీఐ మావోయిస్టు పార్టీలో రిక్రూట్‌మెంట్‌లో భాగంగా, ఏ2ని ప్రోత్సహించి ఈ నెల మొదటి వారంలోతేది 03-04-2023 రోజున A-1 కోట ఆనందరావు, A-2 చేన్నగొని గణేష్ @ అభిరాం @ సూర్యను హైదరాబాద్ నుండి ట్రైన్ లో మంచేరిఅల్ కు తీసుక వచ్చి సీపీఐ మావోయిస్టులకు పార్టీలో చేర్చినాడు. A-2 ఛత్తీష్‌గఢ్ అటవీ ప్రాంతంలో దళం వద్ద ఒక వారం పాటు ఉండి, ఎ1కోట ఆనందరావు, నుండి పేలుడు పదార్థాలు మరియు సీపీఐ మావోయిస్టు పార్టీ పత్రాలను తీసుకురావడానికి వెల్లి, ఈ రోజు తీసుకొని వస్తుండగా పోలీసువారు పట్టుకున్నారు.
SEIZED METERIAL :-
A1. కోట ఆనందరావు వద్ద ఉన్న చేతి సంచి ని తనిఖీ చేయగా అందులో : (5) జెలటిన్ స్టిక్స్ , (15), డిటోనేరర్సు, పార్టీ డాక్యుమెంట్స్, మొబైల్ ఫోన మరియు మోటర్ సైకల్ స్వాదినపరుచుకున్నాం
A2 చేన్నగొని గణేష్ @ అభిరాం @ సూర్య వద్ద (5) జెలటిన్ స్టిక్స్, (10) ఎలక్ట్రిక్ దేతోనతోర్స్, పార్టీ డాక్యుమెంట్స్ , మొబైల్ ఫోన్ స్వాదీనం చేసుకున్నారు
ACCUSED PERSONS:- A1 కోట ఆనందరావు s/o మల్లేశ్ , వ.26 సం.లు, కులం: నేతకాని , r/o జిల్లెడ గ్రా,పెంచికల్పేట్ మం, ఆసిఫాబాద్ జిల్లా.A2 చెన్నగోని గణేష్ @ అభిరామ్ @ సూర్య s/o నర్సింహా, వ.22 సం.లు, కులం గౌడ్ r/o కొరిటికల్ గ్రా, మునుగోడు మం, నల్గొండ జిల్లా.A3.సోయం చిన్నయ్య, s/o పోచయ్య, వ.56 సం.లు, కులం ST కోయ, r/o సులుగుపల్లి గ్రామం, బెజ్జూర్ మండలం, A4. సిడం జంగుదేవ్, s/o శంబు, r/o మత్తడిగూడ, ఉట్నూర్, A5.కోట సతీష్, s/o మల్లేష్, వ.24, కులం, SC నేతకాని r/o జిల్లెడ గ్రామం, మురళిగూడ GP, పెంచికలపేట మండలం ఆసిఫాబాద్ జిల్లా, A6. సడమేత నగేష్, r/o సులుగుపల్లి గ్రామం, బెజ్జూర్ మండలం, A7. పొర్శెట్టి ధర్మయ్య, r/o సులుగుపల్లి గ్రామం, బెజ్జూర్ మండలం, మరియు UG Cadre- A8.పుల్లూరి ప్రసాద్ రావు @ చంద్రన్న, A9. మైలరపు ఆడేల్లు @ భాస్కర్, A10. బండి ప్రకాష్ @ ప్రభాత్, A11. రాధాక్క, A12. మున్నా, A13. వర్గీష్, A14. మనిష్, A15. రామన్న @ చెన్నూరి శ్రీనివాస్, ఇట్టి నేరస్తుల పై Cr No. 21/2023 u/sec 120,120(B) IPC, Sec 10, 13,16,18,18B of Unlawful Activities (prevention) Avct-1967 and sec 4 & 5 of ES Act -1908 of PS Penchikalpet.
ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) అచ్చేశ్వర రావు, కాగజ్ నగర్ డిఎస్పీ కరుణాకర్, కాగజ్ నగర్ రూరల్ సీఐ నాగరాజు, పెంచికల్ పేట్ ఎస్ఐ విజయ్, కాగజ్ నగర్ రూరల్ ఎస్ఐ సోనియా పాల్గొన్నారు.

