DIGITAL MANCHERIAL NEWS:- భైంసా మండలంలోని వానల్పాడు గ్రామానికి చెందిన సుబ్బమ్మ కు పురిటి నొప్పులు రావడంతో వారి కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న 108 సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని నొప్పులతో బాధపడుతున్న మహిళని అంబులెన్స్ లో హాస్పటల్ కు తీసుకు వెళుతుండగా మార్గమధ్యంలో నొప్పులు ఎక్కువ అవ్వడంతో అంబులెన్స్ లో ఉన్నటు వంటి సిబ్బంది ఈఎంటి లక్ష్మణ్ పూజారి మహిళకు ప్రసవం చేయడం జరిగింది. ప్రసవంలో మహిళకి ఆడ శిశువు జన్మించడంతో పాటు తల్లి శిశువు ఇద్దరు క్షేమంగా ఉన్నారని సిబ్బంది తెలియచేశారు. వీరికి భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. గర్భిణి సుబ్బమ్మతో పాటు శిశువు కూడా క్షేమంగా ఉన్నారని భైంసా ఆసుపత్రి సిబ్బంది వెల్లడించడంతో, బాధితులు సిబ్బందికి ధన్యవాదాలు తెలుపడం జరిగింది.

