DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లాలోని నెన్నెల మండలంలో కుక్కల దాడిలో జింక మృతి అయిన సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... బుధవారం ఉదయం ఆహారం కోసం అడవిలో నుంచి గ్రామ శివారులోకి వచ్చిన జింకను జెండా వెంకటపూర్ గ్రామ శివారులో వీధి కుక్కలు వేటాడి చంపాయి. సంబంధిత గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.

