ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంచిర్యాల ఎమ్మెల్యే.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల నియోజకవర్గంలోని లక్షెటిపేట పట్టణంలోని శివాజీ నగర్ లో కరీంనగర్ జిల్లా కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ అంజాద్ అలీ, లక్షెటిపేట కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ షాహిద్ అలీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో  పాల్గొన్న ఎమ్మెల్యే దివాకర్ రావు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రంజాన్ పండుగను ప్రతి ఒక్కరు ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని పిలుపునిచ్చారు. రంజాన్ పండుగ సందర్భంగా అందించే ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతిగా నిలుస్తానని పేర్కొన్నారు. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ తిప్పన లింగయ్య, మాజీ డిసిఎంఎస్ చైర్మన్ కేతిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ చైర్మన్ నలమాస్ కాంతాయ, వైస్ చైర్మన్ పొడేటి శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు సజ్జు, మెట్టు రాజు, మైనార్టీ సంఘం నాయకులు , తదితరులు పాల్గొన్నారు.




Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by