ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనాల వేలం పాట.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల నియోజకవర్గంలో/span>ని లక్షట్ పేట్ మండల ప్రజలకు మరియు పట్టణ వాసులకు తెలియజేయునది ఏమనగా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ లక్షెట్టిపేట పరిధిలో సరైన పత్రాలు లేకపోవడం, ఇతర కారణాల చేత వివిధ కేసులతో జప్తు చేయబడిన 11 ద్విచక్ర వాహనాములకు తేదీ 11-04-2023 మంగళవారం రోజున ఉదయం 11 గంటలకు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారి సమక్షంలో బహిరంగ వేలం పాట నిర్వహింపబడును. కావున ఆసక్తి కలవారు తేదీ 11 -4- 2023 రోజున నిర్వహించే బహిరంగ వేలంలో పాల్గొనవచ్చునని లక్షెట్టిపేట ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్. బాబా తెలిపినారు. వేల పాటలో  పాల్గొనాలి అనుకునేవారు ముందుగానే కొంత మొత్తంలో డిడి రూపంలో చెల్లించి, వేలంపాటలో పాల్గొనవచ్చని తెలిపారు. ఇట్టి వాహనం లకు సంబంధించిన వివరములు స్టేషన్లో తెలుసుకోవచ్చని తెలియజేశారు.




Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by