DIGITAL MANCHERIAL NEWS:- ఉట్నూర్ మండలంలోని బాబాపూర్ గ్రామ శివారులో ఉన్న అటవీ ప్రాంతంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని ఉట్నూర్ ఎస్సై భరత్ సుమన్ తెలిపారు. ఆదివారం ఉదయం ఆయన మాట్లాడుతూ.... బాబాపూర్ గ్రామ శివారులో ఉన్న అటవీ ప్రాంతంలో ఒక వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించామన్నారు. మృతుడి వయస్సు 30 నుంచి 35 సంవత్సరాల వరకు ఉంటుందని ఆయన వెల్లడించారు. మృతుడిని గుర్తుపట్టిన వారు తమ సెల్ ఫోన్ నెంబర్లు. 8712659939, 8712659937 లలో సమాచారం అందించి సహకరించాలని ఆయన సూచించారు.

