పంచాయతీ సెక్రెటరీ సమ్మెకు మద్దతుగా కారోబార్లు.
May 03, 2023
0
DIGITAL MANCHERIAL NEWS:- కాసిపేట మండలంలోని ఎంపీడీవో కార్యాలయం ముందు జూనియర్ & అవుట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శుల క్రమబద్ధీకరణకై పంచాయతీ కార్యదర్శులు చేస్తున్న నిరవధిక సమ్మెకు మద్దతు తెలిపిన కాసిపేట మండల వ్యాప్తంగా ఉన్న కారోబర్లు. ఈ సందర్భంగా సందర్భంగా వారు మాట్లాడుతూ.... మూడు సంవత్సరాల లోనే పంచాయతీ సెక్రెటరీ పర్మినెంట్ చేస్తామని చెప్పి, అదనంగా మరో సంవత్సరం వారితో పనులు చేయించుకున్నప్పటికీ ఇప్పటివరకు పర్మినెంట్ చేయకపోవడం చాలా బాధాకరమైన విషయమని వారు తెలిపారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పంచాయతీ సెక్రెటరీ పర్మినెంట్ చేయాలని వారు మద్దతుగా డిమాండ్ చేశారు.

