DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లాలోని లక్షట్ పేట్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగి వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... లక్షెట్టిపేట మండలంలోని గుల్లకోట గ్రామ 63వ జాతీయ రహదారిపై బుధవారం మధ్యాహ్నం ఇసుక లోడ్తో వెళ్తున్న లారీ అదుపుతప్పి చెట్టుకు ఢీకొన్న ఘటనలో డ్రైవర్ పసుపుల్ల కృష్ణస్వామి (36) అక్కడికక్కడే మృతి చెందాడు. చెన్నూరు వైపు నుంచి ఇసుకను లోడ్ చేసుకుని నిర్మల్ కు వెళ్తున్న లారీ మార్గమధ్యలో గుల్లకోట వద్ద చెట్టును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తామని తెలిపారు. కాగా ఈ ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి నిర్మల్ వాసిగా గుర్తించారు.

