DIGITAL MANCHERIAL NEWS:- బెల్లంపల్లి నియోజకవర్గంలోని నెన్నెల మండలం జెండావెంకటాపూర్ గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన బండారి లక్ష్మీ-తిరుపతి కూతురి వివాహానికి 10,000 రూపాయల ఆర్థికసహాయాన్ని అందచేసిన బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు శనివారం సాయంత్రం స్థానిక గ్రామ సర్పంచ్, BRS పార్టీ శ్రేణులు కలసి ఆ యొక్క ఆర్థిక సహాయాన్ని వారి కుటుంబానికి అందచేశారు. ఇందుకుగాను కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

