DIGITAL MANCHERIAL NEWS:- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ఈనెల 9వ తారీకు నుంచి లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేస్తానని తెలిపిన ప్రభుత్వం అలాగే 2017 -18 సంవత్సరంలో ఐదు లక్షల నిరుద్యోగులు దాదాపు వెయ్యి రూపాయల వరకు ఖర్చుపెట్టుకుని కులం మరియు నివాసం, ఆదాయం పత్రాలను సమర్పించి ఇంటర్వ్యూలకు హాజరు కాని వారికి కూడా అప్లై చేసుకున్న బీసీ వాళ్లకు కూడా వీళ్ళతోపాటు లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించాలని బెల్లంపల్లి పట్టణ పద్మశాలి సంఘం నాయకుడు కోడిపాక శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో 2017-18 సంవత్సరంలో అప్లై చేసుకున్న 5 లక్షల నిరుద్యోగులకు కూడా వెంటనే లక్ష రూపాయలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

