DIGITAL MANCHERIAL NEWS:- బెల్లంపల్లి నియోజకవర్గం కాజీపేట మండలంలోని చిన్న ధర్మారం గ్రామంలో ముస్లిం మైనార్టీ వాడలో కొన్ని నెలల నుంచి నీటి సౌకర్యం లేదని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, మరియు బిజెపి నాయకులు మాట్లాడుతూ... కొన్ని నెలల క్రితం బోర్ వెల్ వేసినప్పటికీ విద్యుత్ కలెక్షన్ ఇవ్వడం లేదని వారు ఆరోపించారు. అలాగే మైనార్టీ వాడలో ఉన్న హ్యాండ్ బోర్ ఉన్నప్పటికీ కనీసం మరమ్మతులు చేయించడం లేదన్నారు. అలాగే ముస్లిం మైనార్టీ వాడలో కనీస రోడ్ సౌకర్యం లేక 108 కానీ ఆటో వెళ్లలేని దుస్థితి నెలకొంది అంటున్నారు. అలాగే చిన్న ధర్మారం గ్రామంలో గ్రామ పంచాయతీ ఏర్పడి సంవత్సరాలు గడుస్తున్న ఇక్కడ ఉన్న ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ బుఖ్య సునీత కి మొరపెట్టుకున్న గ్రామసభల్లో చెప్పిన అభివృద్ధి గ్రామంలో ఏమాత్రం కనిపించడం లేదన్నారు. ఆ గ్రామపంచాయతీకి సంబంధించిన వార్డ్ నెంబర్లకు ఆ గ్రామపంచాయతీలో కనీస విలువ ఇవ్వడం లేదు. సమస్య విషయంలో వెళ్లి మాట్లాడుకునే అవకాశం కూడా కల్పించడం లేని దుస్థితి ఈ చిన్న ధర్మారం గ్రామపంచాయతీలో ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే వెంటనే ముస్లిం వాడలో ఉన్న మా సమస్యలు తక్షణమే తీర్చాలని లేనియెడల తీర్చకపోతే నీళ్ల బిందెలతో గ్రామపంచాయతీ ముట్టడిస్తామని మహిళలు హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శిసురం సంపత్ కుమార్, ఉపాధ్యక్షులు భాకి నరేష్, పులవేణి పోశం, గ్రామ వార్డు సభ్యులు సల్మా, గ్రామ మహిళలు సైనా సల్మా, షరీఫా సఫియా, బి జాన్ బి ఆసియా అనిషా రజియా, రెహనా, అనిషా గ్రామస్తులు మహిళలు తదితరు పాల్గొన్నారు.

