తైదల బాపు జన్మదిన సందర్భంగా సాయి బోధన్.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- 

-బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదానం.

- గర్భిణులకు, బాలింతలకు, రోగులకు అన్నదానం.

- బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహణ.

బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో తైదల బాపు జన్మదిన సందర్భంగా  మంగళవారం మధ్యాహ్నం ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతలు సినీగేయ రచయిత మరియు నిర్మాత తైదల బాపు యువసేన సభ్యుల సహకారంతో గర్భిణులకు బాలింతలకు, రోగులకు, అన్నార్తులకు సాయి భోజన్ అన్నదానం చేసినట్లు బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ -రాజేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని, గర్భిణీలు, బాలింతలు, రోగులు, అన్నార్తులు, ఆసుపత్రి సిబ్బంది, సాయి భోజన్ అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు. వారందరూ అన్నదానం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ, బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ వారికి మరియు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...ట్రస్ట్ ద్వారా "ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం-అన్నదానంతో తృప్తి పరుద్దాం" అని ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్-రాజేశ్వరి పిలుపునిచ్చారు. సేవే లక్ష్యం, సేవే మార్గంతో ట్రస్ట్ కొనసాగుతుందని, మానవ సేవే మాధవ సేవ అని త్రవిద్య, శ్రవిద్య, త్రయాక్షర్  తెలిపారు. ఈ సేవా కార్యక్రమములో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, సేవకులు కోంక శ్రీనివాస్, యేనుగు హేమలత,తైదల శ్రీనివాస్, దుగుట శ్రీనివాస్, మరియు తైదల యువసేన అధ్యక్షులు మహేందర్,సభ్యులు డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బంది, మీడియా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ద్వారా అన్నదానం, సాయం అందించాలని అనుకునేవారు ట్రస్ట్ మేనేజర్ 8106550532, ఫౌండర్స్ 9959269975, 9949041595 సంప్రదించాలని కోరారు.






Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by