DIGITAL MANCHERIAL NEWS:- నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని అత్మహత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది. పీయుసీ ప్రథమ సంవత్సరం చదువుతున్న సంగరెడ్డి జిల్లాకి చెందిన వడ్ల దీపిక వార్షిక పరీక్షలు రాసి. అనంతరం బాత్రూం కి వెళ్లి ఎంతకీ రాకపోవడంతో అనుమానం వచ్చిన బాలికలు భద్రతా సిబ్బందికి సమాచారం అందించారు. వారు చూసేసరికి చున్నితో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అపస్మారక స్థితిలో ఉన్న విద్యార్థినిని క్యాంపస్ హెల్త్ సెంటర్లో ప్రధమ చికిత్స చేసి, అనంతరం భైంసా ఏరియా హాస్పిటల్ కి తరలించారు. భైంసా ఏరియా హాస్పిటల్ వైద్యులు దీపిక మృతి చెందినట్లు ధ్రువీకరించారు. పోస్టుమార్టం నిమిత్తం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు.

