చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎసిసి- 3 అంగన్ వాడి కేంద్రంలో గురువారం చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్ వాడి టీచర్ ఎన్. పద్మ పలువురు చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ... అంగన్ వాడి కేంద్రాల్లో చిన్నారులకు ఆటపాటలతో కూడిన విద్యతో పాటు పౌష్టికాహారం అందిస్తున్నట్లు తెలిపారు. అంగన్ వాడి సేవలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్ వాడి సహాయకురాలు లత, తదితరులు పాల్గొన్నారు.




Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by