DIGITAL MANCHERIAL NEWS:- నిర్మల్ జిల్లాలోని కుంటాల మండలంలో చిరుత పులి సంచారం కలకలం రేపుతుంది. వివరాల్లోకి వెళితే... కుంటాల మండలంలోని దౌనెల్లి గ్రామ శివారులో గురువారం సాయంత్రం పూట శీలం దిగంబర్ అనే రైతు మేకలు మేపుతుండగా మేకల మందపై చిరుత పులి ఒకేసారిగా దాడి చేసి మూడు మేకలను గాయపరిచినట్లు మేకల రైతు తెలియజేశాడు. చిరుత పులి సంచారంతో చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే సంబంధిత అటవీశాఖ అధికారులు స్పందించి... చిరుత పులి నుండి మమ్మల్ని కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.

