DIGITAL MANCHERIAL NEWS:- నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలో చెట్టును ఢీకొన్న బైకు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు గాయాలతో బయటపడ్డారు. వివరాలలోకి వెళితే... సయ్యద్ సమీ , మొహమ్మద్ జియాన్ లు ద్విచక్ర వాహనంపై గురువారం మండలంలోని చిన్నబెల్లల్ గ్రామానికి బయలుదేరి వెళ్లారు. ఈ క్రమంలో మార్గమధ్యంలో రహదారి పక్కనే ఉన్న ఒక చెట్టును బైక్ ఢీకొనడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. వైద్య చికిత్స నిమిత్తం ఇద్దరిని నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వెళుతుండగానే సయ్యద్ సమీ అనే వ్యక్తి మార్గమధ్యంలో మృతి చెందాడు. మరో యువకుడు మహమ్మద్ జియాన్ పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రిలోనే వైద్యులు చికిత్స అందిస్తున్నారు. బక్రీద్ పండుగ వేళ రోడ్డు ప్రమాదంలో సయ్యద్ సమీ మృతి చెందడం వారి కుటుంబంలో విషాదం నెలకొంది.

