DIGITAL MANCHERIAL NEWS:- బీజేవైఎం కాసిపేట మండలాధ్యక్షునిగా నగరపు ప్రసన్న ఎన్నికయ్యారు. మంచిర్యాలలోని బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన బీజేవైఎం జిల్లా కార్యవర్గ సమావేశంలో బీజేవైఎం జిల్లాధ్యక్షుడు పట్టి వెంకట కృష్ణ శనివారం నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ప్రసన్న మాట్లాడుతూ.. బీజేపీతో పాటు బీజేవైఎం బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. తన నియామకానికి సహకరించిన బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏముర్ల ప్రదీప్, బిజెపి బెల్లంపల్లి అసెంబ్లీ కన్వీనర్ రాచర్ల సంతోష్, కాసిపేట బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి సూరం సంపత్, మరియు మండల నాయకులకు అందరికీ ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.


