భూకబ్జా దారుల నుండి రాముని చెరువు ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని వినతి పత్రం.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లా కేంద్రంలో లక్షలాది రూపాయలు విలువచేసే రాముని చెరువు కట్టను ఆనుకొని ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కొందరు ఆక్రమించుకొని రాత్రి వేళల్లో అక్రమ నిర్మాణం పనులు చేపడుతున్నారని తెలియజేస్తూ, ఆక్రమ దారుల నుండి రాముని చెరువుకు సంబంధించిన ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ కి రాముని చెరువు వాకర్స్ సభ్యులు మరియు సింగరేణి విశ్రాంత కార్మిక సంఘం నాయకులు వినతి పత్రం అందజేయడం జరిగినది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... ఇరిగేషన్ మరియు మున్సిపల్ అధికారులతో జాయింట్ సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా రాముని చెరువులో దుర్గంధ పూరిత వాసన వెదజల్లుతున్న నిలువ ఉన్న నీటిని వెంటనే బయటకు ఎత్తిపోయాలని, చెరువులో కూరుకుపోయిన దుర్గంధ పూరిత మట్టిని పూడిక తీయాలని, జాఫర్ నగర్, హైటెక్ సిటీ నుండి వచ్చే మురికి నీటిని రాముని చెరువులో కలవకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని, చెరువు కట్ట పైన వాకర్స్ ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించాలని కమిషనర్ మారుతి ప్రసాద్ ని కోరడమైనది. ఈ కార్యక్రమంలో సింగరేణి విశ్రాంత కార్మిక సంఘం అధ్యక్షుడు వాకర్ సభ్యుడు గజెల్లీ వెంకటయ్య, వాకర్స్ నాయకులు జయ రామారావు, విజయకుమార్, N.R.శ్యామ్, బూర్ల జ్ఞాని, G.సత్యనారాయణ మూర్తి, రావుల ప్రతాపరెడ్డి తదితరులు పాల్గొన్నారు.




Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by