పోడు రైతులకు పట్టాలు పంపిణీ చేసిన సీఎం.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం నూతనంగా నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు. జిల్లా అధ్యక్షులు సిర్పూర్ టౌన్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పుకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పార్టీ కార్యాలయంలోని ఆవరణలో జెండా ఆవిష్కరించి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తరువాత గిరిజన మహిళ రైతులకు పోడు పట్టాలు పంపిణీ చేశారు. అదేవిధంగా రైతుబంధు, రైతు బీమా, సాగునీటి సౌకర్యం, విద్యుత్ సరఫరా లాంటి సదుపాయాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కొత్తగా నిర్మించిన జిల్లా కలెక్టర్ కార్యాలయ సముదాయ నూతన భవనాన్ని ప్రారంభించి కలెక్టర్ హేమంత్ సహదేవరావు కు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం పోలీస్ కార్యాలయ కాంప్లెక్స్ ను రిబ్బన్ కట్ కట్ చేసి ప్రారంభించారు. అంతకు ముందు పోలీస్ కాంప్లెక్స్ ప్రాంగణంలోకి చేరుకోగానే జిల్లా పోలీసులు సీఎంకు గౌరవ వందనం సమర్పించారు. గాల్లోకి కాల్పులు జరిపి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ ను తన కొత్త కుర్చీలో కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ.. కలెక్టర్ లు సీఎంకు శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా... ఓ చిత్ర పటాన్ని జ్ఞాపికగా బహూకరించారు. అలాగే జిల్లా కేంద్రంలోని కుమ్రంభీం చౌరస్తాలో గోండు వీరుడు, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు అయిన కుమ్రంభీం విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం కుమ్రంభీం విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, దేవదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్పు బాల్క సుమన్, ఎమ్మెల్సీ దండ విట్టల్, సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్, ఐటీడీఏ ఇన్చార్జి పీవో వరుణ్ రెడ్డి, ఇతర సంబంధిత అధికారులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు.




Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by