DIGITAL MANCHERIAL NEWS:- అదిలాబాద్ జిల్లాలోని గుడిహత్నూర్ మండలంలోని మేకలగండి వద్ద జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా... ఐదుగురికి గాయాలయ్యాయి. గాయాలైన వారిని దగ్గరలోని స్థానిక ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.
వివరాలు చూసుకుంటే... వీరంతా ఇచ్చోడలో ఓ చర్చిలో తెల్లవారుజాము వరకు ప్రార్థనలలో పాల్గొని తెల్లవారుజామున 4 గంటలకు ఆదిలాబాద్‌కు వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. ప్రమాదమునకు గల సమాచారం పోలీసులు తెలియజేయడంతో సంఘటన స్థలానికి చేరుకున్న స్థానిక పోలీసులు మృతి చెందిన వారందరూ ఆదిలాబాద్ పట్టణంలోని రవీంద్రనగర్‌కు చెందిన వారిగా గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు.

