ఫ్లాష్ న్యూస్:- నిషేధిత గంజాయి పట్టివేత..

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా లో ఎస్పీ K.సురేష్ కుమార్ IPS, ఆదేశాల మేరకు ఇస్లావ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అమ్ముతున్నారన్న నమ్మదగిన సమాచారం మేరకు శుక్రవారం సాయంత్రం ఇస్లావ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న విలేజ్ లో సోదాలు నిర్వహించి తరుణ సర్కార్, ఇస్లావ్ విలేజ్ కి చెందిన బికస్ సర్కార్ వారి వద్ద డ్రై 1.5 కిలో గంజాయి  నీ స్వాధీనం చేసుకుని, ఇద్దరి పై కేసు నమోదు చేశారు.



వారి వద్ద దొరికిన గంజాయి విలువ సుమారు రూ. 30000/-వరకు ఉంటుందని తెలిపారు. అలాగే వారిని పోలీస్ స్టేషన్లో అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ సిఐ సుధాకర్, ఎస్సై సందీప్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... యువత మత్తు పదార్థాలకు బానిసలై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, అలాగే ఎవరైనా గంజాయి అమ్మినట్లు మీకు తెలిస్తే వెంటనే మాకు సమాచారం ఇవ్వాలని... అలా సమాచారం ఇస్తే మీ పేర్లను గోపంగా ఉంచుతామని తెలిపారు. ఈ యొక్క టాస్క్ కు సంబంధించి సిఐ సుధాకర్, ఎస్సై సందీప్ కుమార్, ఎస్సై జగదీష్, ఇతర పోలీస్ సిబ్బంది, మధు, రమేష్, విజయ్ సంజీవ్ పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by