ఫ్లాష్ న్యూస్:- పశువధశాల ధ్వంసం... పలువురు అరెస్ట్...!

D Prashanth Netha
0
DIGITAL MANCHERIAL NEWS:- అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీలో పశువధశాలను సోమవారం రాత్రి స్థానికులు ధ్వంసం చేసిన సంఘటన చోటుచేసుకుంది.



వివరాల్లోకి వెళితే... అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీకి వెళ్లే దారిలో పశువధ శాలను ఎలాంటి అనుమతులు లేకుండా నడుపుతున్నారని గతంలో రాష్ట్ర బీజేపీ నాయకురాలు, మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ సుహాసిని రెడ్డి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.



దీనికి స్పందించిన మున్సిపల్ కమిషనర్ అక్కడి నుంచి తరలిస్తామని హామీ ఇచ్చారు. నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి చర్య చేపట్టక పోవడంతో ఇందిరమ్మ కాలనీ వాసులు సుహాసిని రెడ్డి ఆధ్వర్యంలో తిరిగి నిరసన తెలిపి, ఇందులో భాగంగా పశువుదశాల షెడ్డును బిజెపి నేతలు ధ్వంసం చేశారు.



విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొవడంతో... సంఘటన స్థలానికి చేరుకున్న డిఎస్పి ఉమేందర్ ఆధ్వర్యంలో పలువురి ఆందోళనకారులను అరెస్టు చేశారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by