పాము కాటుతో ఐదేళ్ల బాలిక మృతి...!

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లాలోని కన్నెపల్లి మండలంలో పాము కాటుకు గురై బాలిక మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది.



 పూర్తి వివరాల్లోకి వెళితే... కన్నెపల్లి మండలంలోని మెట్పల్లి గ్రామానికి చెందిన తొర్రెం శ్రీనివాస్ కూతురు సాన్విక ( 5 ) గత కొన్ని రోజుల కిందట బెజ్జూర్ మండలంలోని రెబ్బెన గ్రామంలో ఉంటున్న తమ అమ్మమ్మ ఇంటికి వెళ్ళింది. ఇంట్లో ఆడుకుంటుండగా పాము కాటు వేయడంతో గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందింది.

Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by