DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటిఐ కళాశాల ఆవరణలో ఉన్న జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో నేడు మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా ఉపాధి కల్పన అధికారి కౌశిక్ వెంకట రమణ తెలిపారు.
ఆదర్శ ఆటోమొటివేస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్ నగర్ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని, వివరాలకి 9111711173, 6304600392 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

.jpeg)