విద్యారంగ సమస్యలు పరిష్కరించకుంటే... ఉద్యమం తప్పదు:PDSU.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని మంచిర్యాల జిల్లా నూతన కలెక్టరేట్ కార్యాలయంలో పి డి ఎస్ యు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిరసన చేసి, సూపర్డెంట్ విజయనందం కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.



ఈ సందర్భంగా పి డి ఎస్ యు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రెడ్డి.చరణ్, డి.శ్రీకాంత్ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా కూడా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించలేదు. విద్యాశాఖ పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్ పూర్తి స్థాయిలో అందించలేదు. ప్రభుత్వ విద్య సంస్థలలో ఖాళీగా ఉన్న ఏ ఒక్క పోస్టును కూడా ప్రభుత్వం భర్తీ చేయలేదు, అంతటా ఇన్చార్జి ఎంఈఓ, డిఈఓ లతోనే విద్యాశాఖ నడుస్తుంది. ప్రభుత్వ పాఠశాలలో పెట్టే మధ్యాహ్న భోజనముకు సరిపడా బడ్జెట్ సరిపడక మెనూనే మార్చారు. ఇదిలా ఉంటే ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో విచ్చలవిడిగా ఫీజులు దోపిడీ చేస్తున్నారు. పుస్తకాలు, యూనిఫామ్స్ పాఠశాలల్లోనే బహిరంగంగానే అమ్ముతున్నారు. కనీస నిబంధనలు లేకుండా పాఠశాలలు నిర్వహిస్తూ విద్యా హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తున్నారు. అలాగే ప్రైవేటు విద్యాసంస్థల్లో 25% ఉచిత అడ్మిషన్లను అమలు చేయడం లేదు, ప్రైవేటు స్కూళ్ళలో ఫీజు నియంత్రణ చట్టాన్ని చేయడంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది. కాబట్టి పై సమస్యలన్నీ పరిష్కరించాలని పి డి ఎస్ యు విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. లేనియెడల మరోసారి దశలవారీగా ఉద్యమాలు నిర్వహిస్తానని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్యు జిల్లా నాయకులు డి.రాజ్ కుమార్, కే.మనోహర్ సిద్ధార్థ, అజిత్, రాహుల్, సిద్దు తదితరులు పాల్గొన్నారు.





Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by