DIGITAL MANCHERIAL NEWS:- ఉట్నూర్ ఐటిడిఏ నూతన ప్రాజెక్ట్ అధికారిగా చాహత్ బాజ్పయి నియమితులయ్యారు. ఆదివారం ఉదయం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఇప్పటివరకు ఉట్నూర్ ఐటిడిఏ పీఓగా పనిచేసిన వరుణ్ రెడ్డి నిర్మల్ జిల్లాకు కలెక్టర్ గా బదిలీ అయ్యారు, ఇన్చార్జి పిఓగా అయన కొనసాగుతున్నారు. దీంతో నిర్మల్ జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి భార్య ఆసిఫాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్ గా పని చేస్తున్న చాహత్ బాజ్పయిని రెగ్యులర్ ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారిగా నియమిస్తూ ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది ఉట్నూర్ ఐటిడిఏ కు రెగ్యులర్ పిఓను నియమించడంపై ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఆదివాసి గిరిజన సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

