DIGITAL MANCHERIAL NEWS:- రాత్రి కురిసిన భారీ వర్షానికి ఒకరి ఇల్లు కూలిన సంఘటన నేన్నెల మండలంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... నేన్నెల మండలంలోని జెండా వెంకటపూర్ గ్రామానికి చెందిన చిల్మటికారి రాజన్న అనే పేద వ్యక్తి యొక్క ఇల్లు కూలిపోవడం జరిగింది. కురిసిన భారీ వర్షానికి ఇంటికి ఒకపక్క గోడ మొత్తం కూలిపోవడంతో... తమది పేద కుటుంబం కావడంతో తమకు ప్రభుత్వమే అండగా నిలబడాలని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దీనిపై సంబంధిత అధికారులు పర్యవేక్షించి బాధితుడికి నష్ట పరివారం వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు.

