DIGITAL MANCHERIAL NEWS:- బెల్లంపల్లి నియోజకవర్గంలోని బెల్లంపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం పురస్కరించుకొని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... కేటీఆర్ వందేళ్లపాటు చల్లగా ఉండాలని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మరింతగా తోడ్పడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ జక్కుల శ్వేత శ్రీధర్, మున్సిపల్ వైస్ చెర్మెన్ బత్తుల సుదర్శన్, MPP గోమాస శ్రీనివాస్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నునేటి సత్యనారాయణ, గెల్లి రాజలింగ్, కౌన్సిలర్లు నెల్లి శ్రీలత, రమేష్, చిట్యాల మధు, రాములు నాయక్, నీలి కృష్ణ, ఆయుష్మా బేగం బెల్లంపల్లి ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ దామెర కిరణ్ సురేష్, పట్టణ యువజన అధ్యక్షుడు సన్నీ బాబు, బైరం రాజేందర్ పట్టణ కౌన్సిలర్సు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, యువజన నాయకులు కార్యకర్తలు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


