DIGITAL MANCHERIAL NEWS:- బెల్లంపల్లి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులలో ఆంగ్ల మాధ్యమంలో బోధించే గెస్ట్ లెక్చరర్లుగా పనిచేయుటకు అర్హులైన అభ్యర్థులు ఈ నెల 24వ తేదీ సాయంత్రం 4 గంటలలోగా కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ ఎం.గోపాల్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... కళాశాలలో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు వెల్లడించారు. ఆంగ్లము-2, తెలుగు-2, కామర్స్-1 కంప్యూటర్-2, మాథ్స్-1, పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. సంబంధిత సబ్జెక్టులో నెట్ /స్లెట్/సెట్/పీ హెచ్ డి అర్హత ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. అలాగే పీజీలో 55 మార్కులతో ఉత్తీర్ణులై, డిగ్రీ స్థాయిలో బోధన అనుభవం ఉండాలని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 26వ తేదీన ఉదయం 10 గంటల నుంచి కళాశాలలో డెమో, ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు నిజ ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని ప్రిన్సిపాల్ సూచించారు.


