DIGITAL MANCHERIAL NEWS:- రైతు వ్యతిరేక చర్యలకు పాల్పడుతు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు
బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆదేశానుసారం బుధవారం బెల్లంపల్లి మండలంలోని తాళ్ళగురిజల రైతు వేదికలో నిర్వహించిన రైతు సదస్సులో స్థానిక రైతులతో కలిసి చర్చించిన బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఉచిత కరెంటు పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ సత్యనారాయణ, ఎంపీపీ శ్రీనివాస్, వైస్ ఎంపీపీ రాణి-సురేష్, ఎంపీటీసీ శకుంతల, సర్పంచ్ రజిత-వెంకటేష్, మాజీ ఎంపీపీ సుభాష్ రావు, ఇతర సర్పంచ్ లు, ఎంపీటీసీ లు మరియు ఇతర ప్రజాప్రతినిధులు, BRS నాయకులు, రైతులు, స్థానిక ప్రజలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

