బ్రేకింగ్ న్యూస్:-ఘోర రోడ్డు ప్రమాదం ఒక్కరు మృతి...!

D Prashanth Netha
0
DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంబంధించి ఒకరు మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది.



వివరాల్లోకి వెళితే... బెల్లంపల్లి పట్టణంలోని కన్నాల ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో బుధవారం రాత్రి కన్నాల ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో కారు, బైకు ఎదురు ఎదురుగా వచ్చి ఢీ కొట్టుకోవడంతో ఈ ప్రమాదంలో బైకుపై వెళ్తున్న భీమిని మండలంలోని కొత్తగూడ గ్రామానికి చెందిన జాడి రాజ్ కుమార్(35) అక్కడికక్కడే మృతి చెందగా... రెబ్బెన మండలంలోని కిష్టపూర్ గ్రామానికి చెందిన బట్టి మోహన్ పరిస్థితి విషమంగా ఉంది.


 గాయపడిన వ్యక్తిని వెంటనే బెల్లంపల్లి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం మంచిర్యాలకు తరలించారు. సమాచారం తెలుసుకున్న స్థానిక వన్ టౌన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు.



Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by