మహిళ చట్టలు...షీ టీమ్స్ లపై అవగాహన నిర్వహించిన ఎస్ఐ.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి మంచిర్యాల జిల్లా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్(గర్ల్స్), బెల్లంపల్లి విద్యార్థులకు మహిళ చట్టలపై మరియు షీ టీమ్స్ లపై రక్షణ, మరియు సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ పై  అవగాహన కార్యక్రమం మంచిర్యాల షీ టీమ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.



ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా షీ టీమ్ ఎస్ఐ సౌమ్య రెడ్డి మాట్లాడుతూ.... కమ్యూనిటీ  పోలీసింగ్ ద్వారా ప్రజలకు మరింత దగ్గరై సేవలు అందిస్తున్నామని ఏదైనా సమస్య ఉంటే డయల్ 100 కాల్ చేయాలని, స్థానిక పోలీస్ అధికారులకు గాని లేదా "హాక్ ఐ యాప్" ద్వారా తెలియజేయాలని తెలిపారు.



అలాగే ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ లైంగికంగా వేధించటం, వెనకబడటం ఇటువంటి చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. లైంగిక వేధిస్తే ఎవరైనా భయపడకుండా పోలీసులకు సమాచారం ఇవ్వాలని, కొత్త వారిని గుడ్డిగా నమ్మవద్దని  అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలానే సామాజిక దురాచారాల నిర్మూలన, గ్రామీణ వాతావరణ విశిష్టత, కుటుంబ అనుబంధాలు, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. మహిళల గురించి ప్రత్యేక రక్షణ చర్యలు చేపడుతున్నామని రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో మహిళల రక్షణ  మరియు భద్రత సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ గురించి షీ టీమ్స్ పనిచేస్తున్నాయని తెలిపారు. అలాగే ఈ సందర్భంగా మాట్లాడుతూ... స్త్రీలను గౌరవించిన అప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని, మహిళలను ఇబ్బందులకు గురి చేసేవారిపై చట్టపరంగా కఠినంగా వ్యవహరిస్తామని  హెచ్చరించారు. అలాగే ర్యాగింగ్/ఇవి టీజింగ్/పోక్సో/ బాల్య వివాహాలు/వరకట్నం చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో  షీ టీమ్ కానిస్టేబుళ్లు సతీష్, శ్రవణ్, జ్యోతి, మరియు కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by