రాజకీయంగా ఎదురకోలేక ఎమ్మెల్యే పై దుష్ప్రచారం.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- 

- రాజకీయంగా ఎదురకోలేక ఎమ్మెల్యే పై దుష్ప్రచారం చేస్తున్నారు...!

- ఇది కేవలం రాజకీయ కుట్రలో భాగమే: జాడి రాజేష్.



ఇటీవల ఒక వివాదంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే మీద కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని నేతకానీ సామాజిక వర్గానికి చెందిన జాడి రాజేష్ ఆరోపించారు. ఒక దళిత ఎమ్మెల్యే సాధారణ రైతు కుటుంబం నుండి వచ్చి చిన్న చిన్న పదవులలో గెలిచి గత ముప్పై సంవత్సరాలు రాజకీయంగా ఎదిగి ఈ రోజు సొంత నియోజకవర్గం అయిన బెల్లంపల్లిలో ఒకానొక నేతకానీ కులం నుండి ఎమ్మెల్యే గా ప్రజలు గెలిపిస్తే జీర్ణించుకోలేని కొందరు ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఒక దళిత ఎమ్మెల్యే పై టీవీ లల్లో సామాజిక మాధ్యమాల్లో ఇంతగా చేయడం ఎంటి..? టీవీ లైవ్ డీబెట్ లో తీసుకున్న వ్యక్తికి పూర్తి సమాచారం తెలిస్తే ఆది నారాయణ కోసం ఏ మాత్రం తెల్వకుండ అతను సీనియర్ అడ్వకేట్ అని అనడం ఎంటి...? అంటే కేవలం ఎమ్మెల్యే ని బధునాము చేయడమే తప్ప వేరే పని లేదా...? అన్ని వివరాలు తెలిస్తే మాట్లాడాలి. కేవలం అది కావాలని చేసినదే అని ప్రజలు గమనిస్తున్నారు. నియోజక వర్గ ప్రజలు ఎవ్వరూ కూడా ఇటువంటి అసత్య ఆరోపణలు నమ్మవద్దని మళ్ళీ బెల్లంపల్లి లో చిన్నయ్య గెలుస్తారు. ప్రజలు గమనించాలి. చిన్నయ్య ఒక మారు మూల ప్రాంతం నుండి వచ్చి అంచెలు అంచెలుగా ఎదిగారు. ఎక్కడో పట్టణాల్లో పుట్టి పెరగలేదు. చిన్నయ్య ప్రజల మనిషి ప్రజా జీవితమే ఆయన లక్ష్యం . ప్రజల కష్టాలు తీర్చే మనిషి. ఎవ్వరూ ఏ సమస్య తో పోయిన కనీసం ఆ సమస్య మీద వెంటనే స్పందిస్తారు. అటువంటి ఎమ్మెల్యే ని ప్రజలు ఆశీర్వదిస్తారు మళ్ళీ మళ్ళీ... లైవ్ లో ఎమ్మెల్యే సాధారణంగా ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడి వివరణ కూడా ఇచ్చారు. దానికి మళ్ళీ ఫోన్ కట్ చేశాడని మధ్యలో లైవ్ నుండి వెళ్లిపోయాడని అనడం ఏంటి? అంత క్లియర్ గా చెప్పారు ఎమ్మెల్యే. అదే సమాజానికి మేలు చేయాలని ఉద్దేశం ఉంటే మోసపోయిన రైతులతో లైవ్ పెట్టండి. అదే లైవ్ లో రైతులకు ఫోన్ చేయాలని ఎందుకు అనిపించలేదు? అప్పుడు సమాజానికి కూడా నిజ నిజాలు బయటకి వచ్చేవి కదా.? రైతులకు చెయ్యకుండా ఎమ్మెల్యే కీ ఫోన్ చేయాలని స్క్రిప్ట్ లో ఉంది కాబట్టి రైతులకు చెయ్యకుండా ముందుగా ఎమ్మెల్యే కీ ఫోన్ చేశారు. ఒక ప్రజా ప్రతినిధి అని కూడా చూడకుండా కనీస గౌరవం ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడవద్దు.! ఆది నారాయణ ని ముందుగా ఎమ్మెల్యే దగ్గరికి ఎవ్వరూ రమ్మన్నారు.? ఒక కంపెనీ అంటే చుట్టూ ప్రక్కల జీవన ఉపాధి ఉద్యోగ కల్పన దొరుకుతుంది అని ఒక ప్రజా ప్రతినిధి, ఎమ్మెల్యే స్థాయి కాబట్టి ఆలోచిస్తారు. కానీ ఇక్కడ జరిగింది కేవలం మోసం చేయడానికే అని , పక్క పగడ్బంది గా ప్లాన్ తో వచ్చారని తెలిసి పోయింది. కాబట్టి ఇప్పటికీ అయిన మానుకోవాలి. చూస్తూ ఊరుకోదు మా దళిత సమాజం, మా నేతకానీ సామాజిక వర్గం ఏకైక ఎమ్మెల్యే పై ఎన్ని కుట్రలు చేసిన భయపడేది లేదు. చిన్నయ్య ని కాపాడుకుంటూ ఇంకా ప్రజలకు సేవలు అందిస్తాము. ఎన్ని కుట్రలు చేసిన భయపడేది లేదు. త్వరలో బెల్లంపల్లి లో మళ్ళీ గెలిచేది దుర్గం చిన్నయ్య నే వాట్సప్ సామాజిక మాధ్యమాల్లో ఎన్ని కుట్రలు చేసిన ఎవ్వరూ నమ్మరు. చుట్టూ పల్లెల్లో చిన్నయ్య ని కుల మతాలకు అతీతంగా ఒక సాధారణ చుట్టం లాగా ఆహ్వానిస్తారు. నిత్యం ప్రజల్లో ఉంటారని ప్రజలకు తెలుసు కాబట్టి ఇప్పటికైనా మానుకోవాలని నేతకానీ సామాజిక వర్గం నుండి హెచ్చరిస్తున్నాము.

Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by