వివరాల్లోకి వెళితే... దిలావర్పూర్ మండలకేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో సుధాకర్ అనే వ్యక్తి కుమారుడు 5వ తరగతి చదువుతున్నాడు. తరగతి గదిలో ఎక్కువగా అల్లరి చేస్తున్నాడని విమల అనే ఉపాధ్యాయురాలు విద్యార్థి తలపై బలంగా కర్రతో కొట్టడంతో తలలో నుంచి రక్తం కారింది. బాలుడు ఇంటికి వెళ్ళాక వారి కుటుంబ సభ్యులు చూసి ఎలా జరిగిందని అని ఆరా తీసి చికిత్స చేయించారు. పిల్లలు తప్పు చేస్తే ఇలా రక్తం వచ్చేలా కొడతారా కొడతారా అని వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే రక్తం వచ్చేలా కొట్టిన ఉపాధ్యాయురాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

