రైతులకు టార్పాలిన్ కవర్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.

D Prashanth Netha
0
DIGITAL MANCHERIAL NEWS:- బెల్లంపల్లి మండలంలోని కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీలకు రైతులకు టార్పలిన్ కవర్లు పంపిణీ చేయడం జరిగింది.

 వివరాల్లోకి వెళితే... నెన్నెల మండలంలోని జెండా వెంకటాపూర్ గ్రామానికి చెందిన సుమారుగా 140 ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు చెందిన రైతులకు బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య చేతుల మీదగా టార్పలిన్ కవర్లు పంపిణీ చేయడం జరిగింది.

 ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.... తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని, మన దేశంలోనే ఏ రాష్ట్రంలో లేనన్ని సంక్షేమ పథకాలు ఒక మన తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయని అన్నారు. అలాగే రానున్న ఎన్నికలలో కూడా తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీ గెలుపుకు నాంది పలుకుతుందని తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో కేవీకే ఇంఛార్జ్ రాజేశ్వర్ నాయక్, జెండా వెంకటపూర్ గ్రామ సర్పంచ్ వై లక్ష్మి మోహన్, ఇతర ప్రజాప్రతినిధులు, శాస్త్రవేత్తలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.


Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by