DIGITAL MANCHERIAL NEWS:- బెల్లంపల్లి నియోజకవర్గంలోని నేన్నెల మండలం అభివృధి పథంలో ముందుకు నడుస్తున్న క్రమంలో కొందరు కావాలని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని తెరాస మండల అధ్యక్షుడు సాగర్ గౌడ్ ఆరోపించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... గతంలో మండలం ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో ప్రజలకి తెల్సాని అన్నారు. గడ్డం వినోద్ స్థానికంగా ఉండరు. అతను మంత్రిగా ఉన్నప్పుడు మండలానికి రోడ్లు కూడా లేవు. కనీస వసతులు కూడా లేవు. ఎమ్మెల్యే చిన్నయ్య మండల పరిధిలోని ఒక గ్రామ స్థాయి వ్యక్తి ఎమ్మెల్యే గా గెలిచి ఎన్నో అభివృధి పనులు చేశారు. కాంగ్రెస్ పార్టీ గడ్డం వినోద్ కి అసలు గ్రామాలు తెల్వదు. మండలాలు తెల్వదు. కొందరిని పెట్టుకొని ఇలా విమర్శించడం సరి కాదని అన్నారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మీద మాట్లాడే అర్హత కాంగ్రెస్ పార్టీకి పార్టీ నాయకులకు లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు సింగతి రాంచందర్, ప్రతాపరెడ్డి, జాడి రాజేష్, బతిని వెంకగౌడ్, మహేందర్, ఒరెం మల్లయ్య, శ్రీనివాసరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

