ఫ్లాష్ న్యూస్:- పంచాయతీ అధికారి ఆకస్మిక పర్యటన...!

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:-  మంచిర్యాల జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు శనివారం  జన్నారం మండలంలోని రేండ్లగూడా, జన్నారం, పోనకల్ గ్రామాల్లో ఆకస్మికంగా పర్యటించారు.


 ముఖ్యంగా గ్రామాల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించి పనులను సక్రమంగా చేయించాలని... ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని సర్పంచ్, కార్యదర్శులను ఆదేశించారు. అలాగే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....ప్రస్తుతం మల్టీ పర్పస్ పారిశుద్ధ కార్మికులు సమ్మెలో ఉన్న కారణం చేత పారిశుద్ధ్య పనులు ఆపరాదని వేరే ఇతర రోజువారీ కూలీలను తీసుకొని వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇంటింటి నుండి చెత్త సేకరణ,తడి చెత్త, పొడి చెత్త నిర్వహణ, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ, బ్లీచింగ్ చల్లించుట, దోమల నివారణకు ఫాగింగ్ చేయించుట, బయో లార్వా స్ప్రే చేయించుట లాంటి పనులు ఖచ్చితంగా చేయించాలని ఆదేశించారు.


 ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, ప్రజలు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by