ఫ్లాష్ న్యూస్:- దోస్త్ ప్రవేశాల షెడ్యూల్‌లో మార్పు...!

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా... దోస్త్‌ ప్రవేశాలకు సంబంధించి ఆయా తేదీల్లో స్వల్ప మార్పులు జరిగాయి.



ఏకధాటి వర్షాల వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడకుండా గడువు పెంచుతున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వివరాలు చూసుకుంటే... మూడో విడతలో సీట్లు పొందిన వారు ఈనెల 26వ తేదీ వరకు ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌, అన్ని విడతల్లో సీట్లు సాధించిన విద్యార్థులు ఈ నెల 26వ తేదీ లోపు కళాశాలల్లో స్వయంగా రిపోర్ట్‌ చేయాలని అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 26వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. కళాశాలలో చేరిన వారు మరో బ్రాంచిలోకి మారేందుకు ఈ నెల 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఇంట్రా కాలేజ్‌ ప్రక్రియ జరుగుతుందని, వారికి ఆగస్టు 1న సీట్లు కేటాయిస్తామని దోస్త్‌ అధికారులు ప్రకటించారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by