DIGITAL MANCHERIAL NEWS:- మంచిని పెంచుకుంటూ చెడును తుంచగలిగే సామర్ధ్యం గురుకులం ఇస్తుందని అందుకే గురుకులాల్లో చదివిన విద్యార్ధులు గొప్పవాళ్ళు అవుతున్నారని బెల్లంపల్లి ఏసిపి పంతాటి సదయ్య అన్నారు.
సోమవారం తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ బెల్లంపల్లిలో జరిగిన ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్ లో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ముందుగా బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ కె సమ్మయ్, ఎం ఈ ఓ పి మహేశ్వర రెడ్డిలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
గురుకులంలో అంతరం కళాశాల ప్రిన్సిపల్ ఐనాల సైదులు అధ్యక్షతన జరిగిన సభాకార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ...గురుకులంలో ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు నూతనంగా గురుకులానికి వచ్చే తమ్ముళ్ళతో స్నేహపూర్వకంగా మెలుగుతూ వారిలో భయం ఆందోళన ఇంటి మీద బెంగను ప్రేమతో దూరం చేయాలని సూచించారు. అలానే ఇట్లాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని కలలను వెలికి తీస్తాయని స్నేహపూర్వక సంబంధాలు మరింత బలపడేలా చేస్తాయని అన్నారు. విద్యార్థులు బెల్లంపల్లి కీర్తిని దేశం నలుమూలల చాటేలా చక్కగా చదువుకోవాలని సూచించారు. చెడు వ్యసనాలకు బానిస కాకుండా ఉన్న ప్రాంతానికి, కనిపించిన తల్లిదండ్రులకు చెడ్డ పేరు తీసుకు రాకుండా ఉన్నతంగా ఎదగాలన్నారు. గొప్ప స్నేహితుని కలిగి ఉండడం అదృష్టమని అట్లాంటి మంచి స్నేహితులు గురుకులాల్లో కోకొల్లలుగా ఉన్నారన్నారు. గురుకులాల కీర్తి ప్రతిష్టలను పెంచేలా సి ఓ ఈ లో ఉపాధ్యాయులు తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా ప్రిన్సిపల్ కళాశాలలో ఇప్పటివరకు పలు యూనివర్సిటీలు,ఎన్ ఐ టి ,ఐఐటి లు వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో సీట్లు సాధించిన విద్యార్థుల ప్రతిభ గురించి వివరించారు.
-హాస్టల్ జీవితం సామాజిక స్పృహను కలిగిస్తుంది: మున్సిపల్ కమిషనర్ కే సమ్మయ్య.
హాస్టల్ జీవితం ఒకరినొకరు మంచి చెడులు మాట్లాడుకుంటూ సమాజాన్ని చదివే గొప్ప అవకాశాన్ని ఇస్తుందని బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ కే సమ్మయ్య అన్నారు. విశిష్ట అతిధిగా పాల్గొని మాట్లాడుతూ... కొత్త విషయాలను నేర్చుకోవడంలో ఒకరికొకరు సహకరించుకోవాలని సూచించారు. బెల్లంపల్లి సి ఓ ఈ అన్ని రంగాల్లో ముందు ఉండడం ఇతరులకు ఆదర్శంగా తయారు కావడం వ్యక్తిగతంగా నాకెంతో ఆనందాన్ని ఇస్తుందన్నారు. పేదింటి బిడ్డలు ఉన్నత చదువులకు వెళ్లడం గొప్ప విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బెల్లంపల్లి మండల విద్యాధికారి పి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ... బెల్లంపల్లి కే విద్యారంగంలో కేంద్ర బిందువుగా మారిన బెల్లంపల్లి సి ఓ ఈ తన పరిధిలో ఉండడం గర్వకారణం అన్నారు. జాతీయ స్థాయిలో అవార్డులు పొందుతూ ఉత్తమంగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయుల సేవలు ఇతరులకు ఆదర్శనీయమన్నారు. అనంతరం కొనసాగిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో పేరెంట్స్ కమిటి అధ్యక్షులు దాగం తిరుపతి, పూదరి నగేష్ గౌడ్, వైస్ ప్రిన్సిపాల్ కె.రాజ్ కుమార్, జెవిపి కొక్కుల రాజేశ్వర్, అధ్యాపకులు చందా లక్ష్మీనారాయణ, నాగిని శ్రీరామవర్మ, యండి రఫి,అనుముల అనిరుద్, ఆకేనేపల్లి రాజేష్, తాటిపాముల నరేష్, శాతరాజు తిరుపతి, శ్యామ్ సుందర్ రాజు, కామెర ప్రేమలత, అల్లూరి వామన్, కొరల్ల శివతేజస్వి, ఐ.మల్లేష్, మిట్ట రమేష్, సుంకరి అర్జున్, అవునూరి రవి, ఉపాధ్యాయులు వరమని ప్రమోద్ కుమార్, షిండే దత్తప్రసాద్, ఎండి కౌసర్, పొన్నం శ్రీనివాస్, దుర్గం రమాదేవి, దాసం అజిత, యాస్మాని హరిక, సింగారావు స్రవంతి, నడిగోటి రాకేష్, సిబ్బంది గోదారి రాజశేఖర్, రాగడి సమంధర్ తదితరులు పాల్గొన్నారు.





