చెన్నూర్ పట్టణంలోని చాకలి వాడకు చెందిన శిరీష అనే వివాహిత బస్టాండ్ నుంచి ఇంటికి వెళ్లే క్రమంలో తను ఎక్కిన ఆటో లోనే తన హ్యాండ్ బ్యాగ్ ను మర్చిపోయింది. ఇంటికి వెళ్లి తీరికగా ఆలోచిస్తే హ్యాండ్ బ్యాగ్ ను ఆటోలోనే మర్చిపోయానని గ్రహించి, ఇంటి వద్ద నుండే స్థానిక పోలీసులకు వెంటనే సమాచారం అందించింది. వెంటనే స్పందించిన సిఐ వాసుదేవరావు సిసి కెమెరా ఫుటేజీల ఆధారంగా 20 నిమిషాల్లో ఆటోను గుర్తించి బాధితులకు బ్యాగ్ ను అందజేశారు. ఈ సందర్భంగా పోలీసులకు శిరీష మరియు వారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

