DIGITAL MANCHERIAL NEWS:- నిర్మల్ జిల్లాలోని బైంసా పట్టణంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం. వివరాల్లోకి వెళితే...
భైంసా పట్టణం వైపు నుండి నిర్మల్ వైపుగా వెళుతున్న లారీ భైంసా పట్టణంలోని నిర్మల్ చౌరస్తా వద్ద ఎదురుగా వస్తున్న బైక్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోగా... ద్విచక్రంపై వెళుతున్న నర్సాపూర్ మండలంలోని కుస్లి గ్రామానికి చెందిన మోహన్, దత్తు కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే బైంసాలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.




