DIGITAL MANCHERIAL NEWS:- తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ సభ్యులుగా ఎన్నికైన ఎఐసిసి సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావును
మంచిర్యాల పట్టణంలోని తన నివాసంలో సోమవారం నస్పూర్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలసి శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... రానున్న ఎన్నికలలో... కాంగ్రెస్ పార్టీ గెలిచే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త ఇప్పటినుండే కృషి చేయాలని పిలుపునిచ్చారు.