కేటీఆర్ జన్మదిన సందర్భంగా విద్యార్థులతో కలిసి మొక్కలు నాటిన ఎమ్మెల్యే.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ &మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన సందర్భంగా బెల్లంపల్లి పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులతో కలిసి కేక్‌ కట్‌ చేసి మొక్కలు నాటిన బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.


 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆయన నూరేళ్లు చల్లగా ఉండాలని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మరింత తోడ్పడాలని, అలాగే మొక్కలు నాటిన విద్యార్థులందరూ తమ మొక్కలు పెరిగే బాధ్యత కూడా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ జక్కుల శ్వేతా శ్రీధర్, వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, కౌన్సిలర్స్ గెల్లి రాజలింగు, అప్సర్ నెల్లి, శ్రీలత రాములు నాయక్, దామెర శ్రీనివాస్, గోశిక రమేష్,


  కే. చంద్రశేఖర్, షేక్ అస్మ, తుంగపల్లి సుజాత, పోతురాజుల లీల, కో ఆప్షన్ వాజిద్ సాజిద్, వర్కింగ్ ప్రెసిడెంట్ నూనేటి సత్యనారాయణ, బీఆర్ఎస్వి జిల్లా అధ్యక్షుడు బడికల శ్రావణ్, ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షుడు దామెర కిరణ్, పట్టణ యువజన అధ్యక్షులు సన్నీ బాబు, నాయకులు చిట్యాల మధు, పోలు శ్రీనివాస్, కేమ్ శెట్టి శ్రీనివాస్ యువజన నాయకులు రాకేష్ అన్వర్ మౌనిక బైరం రాజేందర్ మద్దెల గోపి అలీ బాయ్ మరియు నియోజకవర్గం ప్రజాప్రతినిధులు, బీ ఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by